బ్రేకింగ్ – ఐపీఎల్ నుంచి త‌ప్పుకున్న రైనా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం – కార‌ణం ఇదే

బ్రేకింగ్ - ఐపీఎల్ నుంచి త‌ప్పుకున్న రైనా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం - కార‌ణం ఇదే

0
108

రైనా అభిమానుల‌కి మ‌రోసారి షాకిచ్చాడు, ఇప్ప‌టికే రిటైర్మెంట్ ప్ర‌క‌టించి ఆయ‌న అభిమానుల‌ని ఢీలా ప‌డేసిన రైనా తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు, ఐపీఎల్ లో రైనా ఆట చూద్దాం అని భావిస్తున్న అభిమానుల‌కి షాక్ ఇచ్చాడు.

అలాగే అల్లాడిపోతున్న చెన్నై సూపర్‌కింగ్స్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది. సీఎస్‌కే కీలక ఆటగాడు సురేష్‌ రైనా ఈ ఏడాది సీజన్‌కు దూరం కానున్నాడు. యూఏఈకి వెళ్లిన రైనా వ్యక్తిగత కారణాలతో ఇండియాకి తిరిగి రానున్నాడు. అయితే రైనానే త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించార‌ట‌.

గత సీజన్లలో సురేష్‌ రైనా సీఎస్‌కే విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇలాంటి ఆటగాడు సీజన్‌ మొత్తం దూరమవ్వడం చెన్నైకి మైనస్‌ కానుంది. సీఎస్ కే త‌ర‌పున కీల‌క ఆట‌గాడు, మంచి విజ‌యాలు అందించాడు, అలాంటి రైనా ఇలా త‌ప్పుకోవ‌డం పై షాక‌య్యారు అంద‌రూ, అయితే వ్య‌క్తిగ‌త కార‌ణాలే కార‌ణం అని తెలుస్తోంది.