సురేష్ రైనా – హర్భజన్ కు ఎన్ని కోట్లు నష్టమో తెలుసా

సురేష్ రైనా - హర్భజన్ కు ఎన్ని కోట్లు నష్టమో తెలుసా

0
125

ఐపీఎల్ లో చెన్నై టీం తరపున సురేష్ రైనా హర్భజన్ ఈసీజన్ కు దూరంగా ఉన్నారు, అయితే ఈ ఎఫెక్ట్ సీఎస్కేపై పడింది అనే చెప్పాలి, వ్యక్తిగత కారణాలతో వారుఈ సీజన్ నుంచి దూరంగా ఉన్నారు. అయితే వీరికి ఎంత నగదు లాస్ అయింది అనేదానిపై అనేక చర్చలు జరుగుతున్నాయి.

2018 వేలం మార్గదర్శకాల ప్రకారం రైనా, భజ్జీతో చెన్నై మూడేళ్ల కాలానికి ఒప్పందాలు చేసుకుంది.
ఏడాదికి రూ.11 కోట్లకు రైనా, రూ.2 కోట్లకు భజ్జీతో ఎన్.శ్రీనివాసన్ నేతృత్వంలోని ఫ్రాంచైజీ ఒప్పందాలు చేసుకుంది. అంటే రైనా ఈసారి మొత్తం 11 కోట్లు కోల్పోయాడు, అలాగే భజ్జీ 2 కోట్లు కోల్పోయాడు.

వచ్చే లీగ్ వరకూ ఇక వారికి ఎలాంటి నగదు రాదు, ప్రాక్టీస్ చేసిన మ్యాచులకి కూడా నగదు వచ్చే అవకాశం లేదు, గడిచిన రెండు సంవత్సరాల్లో నగదు వచ్చింది కాని ఈ ఏడాది లీగ్ లో లేరు కాబట్టి వారికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు అని తెలుస్తోంది