క్రికెటర్ సురేశ్ రైనాకు ఆపరేషన్

క్రికెటర్ సురేశ్ రైనాకు ఆపరేషన్

0
96

టీమిండియా బ్యాట్స్ మెన్ సురేశ్ రైనా మోకాలికి ఆపరేషన్ జరిగింది. గత కొంతకాలంగా మోకాలి సమస్యతో రైనా బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో, ఆమ్ స్టర్ డ్యామ్ లో మోకాలికి ఆయన చికిత్స చేయించుకున్నాడు. ఆపరేషన్ విజయవంతమైనట్టు అక్కడి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. రైనా పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాల సమయం పడుతుందని తెలిపారు. రైనా ఆపరేషన్ పై బీసీసీఐ స్పందించింది. త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ట్వీట్ చేసింది.