నిన్నటి నుంచి అందరూ ఒకటే చర్చ.. ఎందుకు భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఐపీఎల్ నుంచి వైదొలిగి ఇంటికి వస్తున్నాడు, ఏమైంది అని అభిమానుల నుంచి క్రికెట్ అభిమానుల వరకూ అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు, దీనికి కారణం?
దోపిడి దొంగల దాడిలో భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా బంధువు గాయపడి మరణించాడు. అతడి కుటుంబసభ్యులు నలుగురు తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయం తెలియడంతో, చిన్నతనం నుంచి తనకు ఎంతో ఇష్టమైన వారికి ఇలా జరిగింది అని తెలియడంతో రైనా భారత్ తిరిగి వచ్చేస్తున్నారు.
దాదాపు పది రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రైనా బంధువు అశోక్ కుమార్ పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లా ధరియాల్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఆయన కాంట్రాక్టర్ , అయితే
ఆఇంటిపై దోపిది దొంగల కన్ను పడింది. ఆగస్టు 19న అర్ధరాత్రి సమయంలో అశోక్ కుమార్‌పై కుటుంబసభ్యులపై దోపిడీ దొంగలు విచక్షణారహితంగా దాడి చేసి బంగారం, నగదు దోచుకెళ్లారు.
ఆయన మరణించారు, కాని కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు..ఈ విషయం లేట్ గా తెలియడంతో, ఐపీఎల్ 2020 ఆడేందుకు యూఏఈకి వెళ్లిన రైనా భారత్‌కు తిరిగొచ్చేశాడు.