RCB అభిమానులకు సర్​ప్రైజ్​..కొత్త సాంగ్​ విన్నారా?

Surprise for RCB fans..Have you heard the new song?

0
108

రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ అభిమానులకు సర్​ప్రైజ్​ ఇచ్చింది. ఫ్యాన్స్​లో జోష్​ను నింపేందుకు ఓ పాట​ను రిలీజ్​ చేసింది. ట్విట్టర్​ వేదికగా మంగళవారం ‘నెవర్ గివ్ అప్’ సాంగ్​ను విడుదల చేసింది.

ఆర్సీబీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య, డ్యాన్సర్ ధన్​శ్రీ వర్మ ఈ పాటకు కొరియోగ్రఫీ చేసింది. హర్ష్​ ఉపాధ్యాయ్​ సంగీతం అందించాడు. ఈ పాటలో అలరించిన ఆటగాళ్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ. ఆర్సీబీ జెర్సీతో ముందుకు దూసుకెళ్లాలని కోరుతూ ట్విట్టర్​ పోస్ట్​కు కాప్షన్ జోడింది.

నెవర్​ గివ్ అప్ సాంగ్​లో..కోహ్లీ, మ్యాక్స్​వెల్, పడిక్కల్, చాహల్ సహా ఆటగాళ్లు అందరూ ఆనందంగా చిందులేస్తూ కనిపించారు. ఇటీవలే అన్ని క్రికెట్​ అన్ని ఫార్మాట్లాకు వీడ్కోలు పలికిన ఏబీ డివిలియర్స్​ కూడా ప్రత్యేకంగా కనిపించడం విశేషం.

ఐపీఎల్-2021లోనూ అభిమానులకు నిరాశే మిగిల్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. జట్టు ఓటమి కంటే ఈ సీజన్​ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడం వారికి మరింత ఆవేదన మిగిల్చింది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్​కు ముందు మెగా వేలం జరగనున్న క్రమంలో కొత్త ఆటగాళ్లను తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

https://twitter.com/RCBTweets