ఐపీఎల్ -2022 కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే జట్లు అంటిపెట్టుకునే జాబితా తెలపగా ఫిబ్రవరి లో మెగా వేలం జరగనుంది. అయితే ఐపీఎల్ ను ఎక్కడ నిర్వహించాలి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
మరోవైపు టైటిల్ స్పాన్సర్ షిప్ ఎవరనే దానిపై గత కొన్ని రోజుల నుంచి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గత కొన్ని సీజన్ల నుంచి వీవో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. అయితే.. తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) -2022 టైటిల్ స్పాన్సర్ షిప్ గా టాటా కంపెనీ నియామకం అయినట్లు ఐపీఎల్ చెర్మన్ బ్రిజేష్ పటేల్ పేర్కొన్నారు.
ఈ మేరకు ఇవాళ కీలక ప్రకటన చేశారు. గత సీజన్లోనే వివోను తొలగించాలని డిమాండ్స్ రాగా.. ఒప్పందం ప్రకారం దానినే కొనసాగించారు. వివోకు ఇంకా రెండేళ్ల కాంట్రాక్ట్ ఉంది. కానీ వారు తమ కాంట్రాక్టును రద్దు చేసుకునేందుకు ముందుకు రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.