నేడే టీమ్​ఇండియా- అఫ్గాన్​ మ్యాచ్..ఈసారైనా గెలిచేనా?

Team India-Afghan match today..will it win anytime soon?

0
92

టీ20 ప్రపంచకప్‌లో టీమ్​ఇండియా మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో కంగుతిని సెమీస్ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకున్న కోహ్లీసేన..అబుదాబి వేదికగా అఫ్గానిస్థాన్​తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించి..సాంకేతికంగా ఉన్న కాసిన్నిఅవకాశాలను నిలబెట్టుకోవాలని టీమ్​ఇండియా భావిస్తుండగా..వరుసగా రెండు ఓటములతో డీలాపడ్డ భారత్‌ను మరోదెబ్బ తీయాలని అఫ్గాన్ వ్యూహాలు రచిస్తోంది.

మరోవైపు.. స్కాట్లాండ్, నమీబియాలపై భారీ విజయాలు నమోదు చేసిన అఫ్గానిస్థాన్..పాకిస్థాన్‌ను దాదాపు ఓడించినంత పనిచేసింది. ఇదే ఊపుతో భారత్‌పై విజయం సాధించి సెమీస్ అవకాశాలను నిలబెట్టుకోవాలనే కసితో ఉంది. మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ తమ టీ20 అనుభవాన్ని అంతా ఉపయోగించి..భారత్‌కు భంగపాటు కలిగించాలనే పట్టుదలతో ఉన్నారు.

టీ20ల్లో హెడ్-టు-హెడ్ రికార్డు పరంగా ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు కేవలం రెండు T20I మ్యాచ్‌లు మాత్రమే ఆడాయి. మెన్ ఇన్ బ్లూ రెండు సందర్భాల్లోనూ విజయం సాధించింది. ముఖ్యంగా, రెండు మ్యాచ్‌లు T20 ప్రపంచ కప్‌లలో నమోదయ్యాయి. ఇదే రికార్డును కొనసాగించాలని భారత్ భావిస్తోంది.

భారత్ ప్లేయింగ్ XI అంచనా:
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషబ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి/రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా

బెంచ్: రవిచంద్రన్ అశ్విన్/వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ , సూర్యకుమార్ యాదవ్, భువనేశ్వర్ కుమార్

ఆఫ్ఘనిస్తాన్
హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్ (కీపర్), రహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, షరాఫుద్దీన్ అష్రఫ్, మొహమ్మద్ నబీ (కెప్టెన్), గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, కరీం జనత్, హమీద్ హసన్, నవీన్-ఉల్-హక్

బెంచ్: ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫరీద్ అహ్మద్, హష్మతుల్లా షాహిదీ, ఉస్మాన్ ఘనీ