‘పుష్పరాజ్’ గా మారిన టీమిండియా ఆల్ రౌండర్ జడేజా..వీడియో వైరల్

Team India all-rounder Jadeja turns into Pushparaj..video goes viral

0
121

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమా పుష్ప. ఈ సినిమా మొదటి రోజు(డిసెంబర్‌ 17) నుంచే వసూళ్ల వర్షం కురిపించింది. అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా తొలి రోజు రూ.71 కోట్లు రాబట్టగా రెండో రోజు రూ.45 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. రెండురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్ల గ్రాస్‌ సాధించింది.

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ తన డైలాగ్స్ తో, నటనతో మెప్పించాడు. పుష్పరాజ్ పాత్రలో బన్నీ ఇరగదీసాడు. ఈసినిమాలో ముఖ్యంగా పుష్ప యాస ఆకట్టుకుంటుంది. అలాగే పుష్పరాజ్ నీ యవ్వ తగ్గేదెలే డైలాగ్ ఇప్పుడు అందరి నోళ్లలో నానుతుంది.

తాజాగా టీమిండియా ఆల్ రౌండర్ జడేజా పుష్పరాజ్ గా మారాడు. అవును నిజమే. అల్లు అర్జున్ లాగే జడేజా గడ్డం పెంచాడు. అలాగే పుష్ప సినిమాలో డైలాగ్ ‘పుష్పరాజ్ నీ యవ్వ తగ్గేదెలే’ అంటూ ఓ వీడియో కూడా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

https://www.youtube.com/watch?v=TQu2naApN7o&t=34s