టీమిడియా క్రికెటర్ బుగ్గలు గిల్లిన అమ్మాయి…

టీమిడియా క్రికెటర్ బుగ్గలు గిల్లిన అమ్మాయి...

0
98

ఒక వైపు కరోనా వైరస్ విజృంభనతో అంతా ఆందోళనతో ఉంటే టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ మాత్రం ఎక్కడ తగ్గేదిలేదని వ్యవహరిస్తున్నాడు… కరోనా వైరస్ తో సతమతమవుతున్న అభిమానులకు వినోదాన్ని ఇవ్వాలనుకున్నాడో ఏమో కానీ తాజాగా మరో సారి టిక్ టాక్ లో అలరించాడు…

చాహల్ ఒక అమ్మాయి ఆటపట్టిస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది…ఒక అమ్మాయి చాహల్ ఇద్దరు నడుచుకుంటూ వస్తుంటారు…ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటూ కొన్ని అడుగులు ముందుకు వేస్తారు… ఈక్రమంలో చాహల్ తన షూ లేస్ ను సరి చేసుకునేందుకు కిందకు వంగుతాడు…

అదే సమయంలో ఆ అమ్మాయి చాహల్ వెనకాలే దాగుని ఆటపట్టించేందుకు ప్రయత్నిస్తుంది… కాసేపు ఆమ్మాయి కోసం వెతుకుతున్న చాహల్ కొన్ని సెకన్ల తర్వాత అసలు విషయాన్ని తెలుసుకుని ఆమె ముఖంపై ఒక పంచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు… దీనికి బదులుగా ఆ అమ్మాయి చాహల్ బుగ్గలు గిల్లి అతని కోపాన్ని తగ్గిస్తుంది… ఆ తర్వాత ఆ అమ్మాయి పరుగెత్తుకుంటూ వెళ్లిపోతుంది..