కెప్టెన్సీకి టీమిండియా క్రికెటర్ గుడ్​బై..!

Team India cricketer goodbye to captaincy ..!

0
117

దేశవాళీ జట్టు బరోనా కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు టీమ్ఇండియా ఆల్​రౌండర్ కృనాల్ పాండ్యా. ఈ విషయాన్ని బరోడా క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. కానీ ఇందుకు గల కారణం మాత్రం అతడు తెలపలేదని స్పష్టం చేసింది యాజమాన్యం. త్వరలోనే కొత్త కెప్టెన్​ ఎవరనే విషయాన్ని వెల్లడిస్తామని పేర్కొంది.

ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గ్రూప్-బిలో 4 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది బరోడా. ఈ టోర్నీలో 4 మ్యాచ్​ల్లో ఓడిన ఈ జట్టు ఒక్క విజయం మాత్రమే సాధించగలిగింది. కృనాల్​తో గొడవ కారణంగా బరోడా జట్టు నుంచి తప్పుకొన్నాడు దీపక్ హుడా.

ఈ విషయం ఆ మధ్య చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దీపక్ రాజస్థాన్ జట్టుకు ఆడుతున్నాడు. కృనాల్ స్థానంలో కొత్త కెప్టెన్​గా కేదార్ దేవధర్ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే నెలలో జరగబోయే విజయ్ హజారే ట్రోఫీ ముందు ఇతడికి సారథ్య బాధ్యతలు అప్పగించే వీలుంది.