సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన మిథాలీ రాజ్ – శుభాకాంక్షల వెల్లువ

0
78

టీమ్ ఇండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఆట అంటే ప్రతీ ఒక్కరికీ ఇష్టమే. ఇక తాజాగా ఆమె ఓ సరికొత్త రికార్డు నమోదు చేశారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా మిథాలీ రాజ్ రికార్డు నెలకొల్పారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడవ వన్డేలో ఆమె ఈ ఫీట్ సాధించారు. 10,273 పరుగులతో మొదటి స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ క్రీడాకారిణి చార్లోటి ఎడ్వర్డ్స్ రికార్డును మిథాలీ అధిగమించారు. దీంతో అంతర్జాతీయ మహిళా క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా మిథాలీ రాజ్ రికార్డు నెలకొల్పారు.

మిథాలీ రాజ్ మొత్తం క్రికెట్ లోని మూడు ఫార్మెట్లలో 10,337 పరుగులు చేశారు.

11 టెస్టు మ్యాచ్ లో 669.

217 వన్డేల్లో 7,304.

89 టి20 మ్యాచ్ల్లో 2,364 పరుగులు సాధించారు.

తాజాగా ఆమె సరికొత్త రికార్డు క్రియేట్ చేయడంతో ఆమెకి క్రీడాకారులు, క్రీడా అభిమానులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.