టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆదివారం అరెస్టు అయినట్లు తెలుస్తోంది. కుల వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసినందుకు ఈయనను హర్యానా పోలీసులు అరెస్టు చేసి.. ఆపై బెయిల్‌పై విడిచిపెట్టినట్లు సమాచారం. గత ఏడాది క్రికెటర్ యుజేంద్ర చాహాల్‌పై కుల వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యువరాజ్‌పై కేసు నమోదైంది.
అందులో భాగంగానే తాజాగా యువరాజ్ సింగ్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే యూవీ తరఫు న్యాయవాది బెయిల్ అప్లై చేయడం.. బెయిల్ రావడం చకచకా వచ్చేశాయి. దీంతో యువరాజ్ బయటకు వచ్చేశాడు.