టీమిండియాకి మరో ఆటగాడు గుడ్ బై

టీమిండియాకి మరో ఆటగాడు గుడ్ బై

0
106

టీమిండియాకి ఆల్ రౌండర్ గా సేవలు అందించిన ఎడమచేతివాటం క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అందరికి తెలిసిన ఆటగాడే … బౌలింగ్ లో సూపర్ హీరో అనే చెబుతారు… పఠాన్ మ్యాచ్ లో బౌలింగ్ చేశాడు అంటే బ్యాట్స్ మెన్ కు షేక్ వస్తుంది, బంతి వచ్చే వేగం రాకెట్ కంటే వేగం అని చెప్పాలి..

తాజాగా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆటకు వీడ్కోలు పలికాడు.. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఆయన క్రికెట్ కు గుడ్ బై చెప్పడంతో అభిమానులు షాక్ అయ్యారు…బరోడాకు చెందిన ఇర్ఫాన్ 120 వన్డేలు ఆడి 173 వికెట్లు పడగొట్టాడు. 29 టెస్టుల్లో 100 వికెట్లు సాధించాడు.

వన్డేల్లో 1544, టెస్టుల్లో 1105 పరుగులు నమోదు చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ 19 ఏళ్ల వయసులోనే అంతర్జాతీ య క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలిలో అద్బుతమైన ఆటతీరు ప్రదర్శించిన ఇర్ఫాన్ తర్వాత తన స్ధానం నెమ్మదిగా కోల్పోయాడు,
35 ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్ 2017లో చివరిసారిగా ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. అప్పటినుంచి వేలంలో ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా ఆయన ఈ డెసిషన్ తీసుకోవడంతో ఓ గొప్ప ఆటగాడి చివరి మ్యాచ్ ఇప్పుడు చూసే అవకాశం లేకుండా పోయింది అంటున్నారు అభిమానులు.