న్యూ లుక్‌లో టీమిండియా ఆటగాళ్లు..బీసీసీఐ అప్ డేట్

0
105

త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచక‌ప్‌లో టీమిండియా ఆట‌గాళ్లు కొత్త జెర్సీల్లో క‌నిపించ‌నున్నారు. ఈ విషయమై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ఓ అప్‌డేట్‌ ఇచ్చింది. అయితే కొత్త జెర్సీ ఎలా ఉంటుంది. దాని రంగు వంటి విషయాలను వెల్లడించలేదు. ఆ వివరాలను ఈ నెల 13న వెల్ల‌డించ‌నున్న‌ట్లు ఇవాళ ట్విట్ట‌ర్‌లో వెల్లడించింది.

గ‌తేడాది ఆస్ట్రేలియాతో జ‌రిగిన టీ20 సిరీస్ నుంచి నేవీ బ్లూ జెర్సీలో దర్శనమిస్తున్న భార‌త క్రికెట‌ర్లు.. అక్టోబర్‌ 24న పాక్‌తో జరగబోయే మెగా పోరులో సరికొత్త జెర్సీలో కనిపించనున్నారు. భార‌త క్రికెట్ జ‌ట్టుకు అఫిషియ‌ల్ కిట్ స్పాన్స‌ర్‌ అయిన ఎంపీఎల్ స్పోర్ట్స్ నూతన జెర్సీని ఆవిష్కరించనుంది.

https://twitter.com/BCCI