చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్..!

0
111

ఐపీఎల్ 2022 నిర్వహణ కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఆయా జట్లు అంటిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసిన యాజమాన్యాలు. ఫిబ్రవరి 12, 13న మెగా వేలం ప్రక్రియ కూడా జరగనుంది. ఇక కెప్టెన్ ఎంపికపై కసరత్తులు మొదలెట్టాయి అన్ని జట్లు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్​ జట్టు కెప్టెన్​ అంశం మరోసారి చర్చల్లోకి వచ్చింది. ధోనీ సారథ్యంలో ఇప్పటికే నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది సీఎస్కే. తదుపరి సీజన్ కు కెప్టెన్ ఎవరనేది ఉత్కంఠగా మారింది.

అయితే ఈ ఏడాది ధోనీ కెప్టెన్​గా కొనసాగుతాడా? లేదా? అన్న అంశంపై కొంతకాలం నుంచి సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో చెన్నై యాజమాన్యం ధోనీ స్థానంలో జడేజాకు కెప్టెన్​ పగ్గాలు అప్పగించనుందనే వార్తలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. గతంలో పలువురు మాజీలు కూడా సీఎస్కేను నడిపించే సామర్థ్యం ఉన్న ఆటగాడు జడేజానే అని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు జడేజా 200 ఐపీఎల్​ మ్యాచ్​లు ఆడగా.. 2386 పరుగులు చేశాడు. 127 వికెట్లు పడగొట్టాడు. గొప్ప ఫీల్డర్ గాను జడేజా మైదానంలో తన ప్రతిభను కనబరుస్తుంటాడు.

ఇప్పటికే పలు ఫ్రాంఛైజీలు తాము రిటైన్​ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. సీఎస్కే యాజమాన్యం ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (రూ.16 కోట్లు), ధోనీ (12 కోట్లు), మొయీన్ అలీ (రూ.8 కోట్లు)‌, రుతురాజ్‌ (రూ. 6 కోట్లు)లను రిటైన్ చేసుకుంది.