భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు జోహన్నస్బర్గ్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. అయితే టీమ్ఇండియా బ్యాటర్లు తడబడ్డారు. ఓపెనర్లు మయాంక్ (26), రాహుల్ (50) కాస్త పోరాడినా.. పుజారా (3), రహానే (0) దారుణంగా విఫలమయ్యారు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా క్రికెటర్ అజింక్యా రహానే చెత్త రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డకౌట్ (మొదటి బంతికే ఔట్)గా వెనుదిరిగాడు రహానే. యువ బౌలర్ ఒలివియర్ ఇతడిని పెవిలియన్ చేర్చాడు. దీంతో తన టెస్టు కెరీర్లో తొలిసారి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగి చెత్త రికార్డు నమోదు చేశాడు రహానే.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా 202 పరుగులు చేసి ఆలౌట్అయింది. అయితే ఈ మ్యాచ్ కు గాయం కారణంగా దూరమయ్యాడు విరాట్ కోహ్లీ. దీంతో కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అయితే రాహుల్ చేసిన ఓ పని ఫీల్డ్ అంపైర్ మరైస్ ఎరస్మస్కు కోపం తెప్పించింది. దీంతో అతడిని మందలించాడు.