బుర్జ్ ఖలీఫాపై మెరిసిన టీమిండియా న్యూ జెర్సీ!

TeamIndia New Jersey shining on Burj Khalifa

0
85

టీ20 ప్రపంచకప్​లో టీమ్ఇండియా ధరించనున్న జెర్సీని భారత క్రికెట్​ నియంత్రణ మండలి బుధవారం రివీల్​ చేసింది. కిట్​ స్పాన్సర్​ ఎంపీఎల్​ స్పోర్ట్స్​తో సంయుక్తంగా బీసీసీఐ ఈ జెర్సీని రూపొందించింది. అయితే.. ఈ కొత్త జెర్సీ చిత్రాలను ప్రపంచ ప్రఖ్యాత కట్టడం బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు యూఏఈ అధికారులు. జెర్సీ విడుదలకు సంబంధించిన వీడియోను ప్లే చేశారు.

అభిమానులే స్ఫూర్తిగా టీమ్​ఇండియా కొత్త జెర్సీని రూపొందించినట్లు బీసీసీఐ తెలిపింది. “అభిమానుల గుర్తుగా జెర్సీని రూపొందించడం భారత క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి. గత మేటి మ్యాచ్‌ల సందర్భంగా అభిమానులు చేసిన నినాదాలు, హర్షధ్వానాలు జెర్సీపై ఉంటాయి” అని ఎంపీల్‌ స్పోర్ట్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అక్టోబర్​ 18, 20న ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియాతో జరగనున్న వార్మప్​ మ్యాచ్​ల్లో టీమ్​ఇండియా ఈ కొత్త జెర్సీని ధరించనుంది

https://twitter.com/iamstake