నయా జెర్సీలో టీమిండియా ఆటగాళ్లు..!

TeamIndia players in New Jersey

0
101

టీమిండియా ఆటగాళ్లకు కొత్త జెర్సీలు వచ్చాయి. బ్లూ కలర్ లోనే కొత్త డిజైన్ తో జెర్సీలను రూపొందించారు. అభిమానుల ఆకాంక్షలకు ప్రతిరూపాలు పేరిట ఈ జెర్సీలను రూపొందించినట్టు బీసీసీఐ పేర్కొంది. వీటిని బిలియన్ చీర్స్ జెర్సీలుగా బోర్డు అభివర్ణించింది.

టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్ లో పాల్గొంటున్నారు. ఈ నెల 15తో ఐపీఎల్ ముగియనుంది. ఆ తర్వాత రెండ్రోజులకే, అంటే ఈ నెల 17న టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఐపీఎల్ కు ఆతిథ్యమిస్తున్న యూఏఈ గడ్డపైనే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు కూడా జరగనున్నాయి. కొత్త జెర్సీలతో టీమిండియా దూసుకుపోవాలని అభిమానులు సందేశాలు పంపుతున్నారు.