త్వరలో పెళ్ళిపీటలెక్కనున్న టీమిండియా స్టార్ ప్లేయర్..

0
115

టీమిండియా స్టార్ ప్లేయర్, లక్నో సూపర్ జెంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గతకొంత కాలంగా బాలీవుడ్ అలనాటి స్టార్ హీరో సునీల్ శెట్టి కుమార్తె అయినా అతియా శెట్టిని ప్రేమిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా కేఎల్ రాహుల్, అతియా శెట్టి జంట బాగుంటుందని నెటిజన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.

తాజాగా ఈ జంట పెళ్లిపీటలెక్కనున్నట్టు తెలిపి కేఎల్ రాహుల్ అభిమానులకు చక్కని శుభవార్త చెప్పారు. ఇప్పటికే వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ లో మంచి గ్రేస్ ఉన్న హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

అతియాశెట్టి ముబారకన్,నవాబ్దాదే, మోతిచూర్ చక్నాచూర్ వంటి బాలీవుడ్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో సునీల్ శెట్టి ప్రస్తుతం ముంబైలో స్థిరపడ్డారు. ఈ ఏడాది చివరిలో పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబాలు  నిర్ణయం కూడా  తీసుకున్నట్టు తెలుస్తుంది.