ముగిసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్..దక్షిణాఫ్రికా లక్ష్యం ఎంతంటే?

TeamIndia's second innings ended..What is South Africa's target?

0
104

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా 174 పరుగులకు ఆలౌట్​ అయింది. ఫలితంగా.. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో (130) కలుపుకుని ప్రత్యర్థి జట్టు ముందు 305 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓవర్‌నైట్ 16/1 స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. శార్దూల్‌ను ఔట్‌ చేసి వికెట్ల పతనం ప్రారంభించిన రబాడ (4/42).. టీమ్‌ఇండియా తక్కువ స్కోరుకే పరిమితం కావడంలో కీలక పాత్ర పోషించాడు.