Big Breaking : కాంగ్రెస్ లో కోదండరాం జన సమితి విలీనం ?

-

తెలంగాణ రాజకీయాల్లో దశాబ్ద కాలం పాటు కీలక నేతగా ఉన్నారు ప్రొపెసర్ కోదండరాం. రాష్ట్ర సాధనలో జెఎసి ఛైర్మన్ గా ఆయన తనవంతు పాత్ర పోశించారు. తెలంగాణ సాధన డైరీలో కోదండరాం కు ఒక పేజీ కచ్చితంగా కేటాయించాల్సిందే అన్నంతగా ఆయన పాత్ర ఉంది. అయితే సొంతగా రాజకీయ పార్టీ నెలకొల్పి చేతులు కాల్చుకున్నారు బడిపంతులు. ఆయన స్థాపించిన తెలంగాణ జన సమితి ఉనికి చాటుకోలేకపోయింది. రాజకీయంగా చతికిలపడింది. స్వయంగా కోదండరాం ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమిపాలవడంతో ఆ పార్టీ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడ్డది. ఈ తరుణంలో కోదండరాం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నట్లు వార్తలు గుప్పముంటున్నాయి.

- Advertisement -

టిపిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమితులైన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కొత్త వాతావరణం నెలకొంది. అప్పటి వరకు నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనబడ్డది. రేవంత్ రెడ్డి దూకుడు స్వభావంతోపాటు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను ఢీకొట్టగల సమర్థుడిగా ఆయన పేరుతెచ్చుకున్నారు. దీంతో ఇప్పటి వరకు చెల్లాచెదరైన కేసిఆర్ వ్యతిరేకులంతా రేవంత్ రెడ్డి వెనకాల, కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అయ్యే వాతావరణం కనబడుతున్నది. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్ నిస్తేజంగా ఉండడంతో బిజెపి వైపు కేసిఆర్ వ్యతిరేక శక్తుల చూపు పడింది. కానీ ఇప్పుడు అక్కడినుంచి కాంగ్రెస్ వైపు మళ్లింది.

ఇక జన సమితి పార్టీ ఏకోశానా భవిష్యత్తులో ముందుకు పోలేని పరిస్థితి నెలకొంది. కోదండరాం వ్యక్తిగతంగా ఉన్నతమైన వ్యక్తిగా ప్రజలు గుర్తించారు. ఆయన తెల్లకాగితం లాంటి వాడే అని అందరిలో ఉంది. కానీ రాజకీయా లు నడపాలంటే కోదండకు సరైన వ్యూహం లేదని అనుకుంటున్నారు. అందుకే ఆయన పార్టీకి ఏనాడూ ఊపు రాలేదు. స్వయంగా ఆయన ఎమ్మల్సీగా ఓటమిపాలయ్యారు. దిగజారిన గలీజు రాజకీయాలు నడపాలంటే పాఠాలు చెప్పే బడిపంతుళ్లకు, ఫెయిర్ పర్సన్స్ కు సాధ్యం కాదని తేలిపోయింది. అందుకే పార్టీని వదిలించుకునే పనిలో కోదండరాం ఉన్నట్లు చెబుతున్నారు.

రేవంత్ రెడ్డి పిసిసి గా ఎన్నికవుతున్నారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో కోదండరాంతో రేవంత్ గత కొంతకాలంగా టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు పిసిసి వస్తే జన సమితిని కాంగ్రెస్ లో విలీనం చేయాలని రేవంత్ కోరినట్లు చెబుతున్నారు. ఇద్దరి మధ్య ఈవిషయమై చర్చలు కూడా సాగినట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి సూచన మేరకే టిఆర్ఎస్ ను వీడిన ఈటల రాజేందర్ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించేందుకు గతంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోదండరాం వెళ్లి కలిసినట్లు ప్రచారంలో ఉంది. కానీ కాంగ్రెస్ లో పిసిసి చీఫ్ ఇంకా అప్పటికి డిక్లేర్ కాలేదు. మరోవైపు కేసుల వత్తిడి ఎక్కువవుతుండడంతో ఈటల బిజెపి వైపు వెళ్లిపోయారు.

రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీలో జన సమితిని విలీనం చేద్దామనే ప్రతిపాదన ఇటీవల కోదంరాం నుంచి వచ్చినట్లు జన సమితి నేతల్లో టాక్ నడుస్తోంది. కుదిరితే కాంగ్రెస్ తో పొత్తు, లేదంటే విలీనం అనేదిశగా వారు సమాలోచనలు చేసినట్లు చెబుతున్నారు.

ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత స్వయంగా ఆయన కోదండరాం ను కలిసి ఓపెన్ గానే విలీనం చేయాలని అభ్యర్థించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మరికొద్దిరోజుల్లోనే జన సమితి కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోవచ్చని టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది.

తెలంగాణ సాధనలో భుజం భుజం కలిపి కొట్లాడిన కోదండరాం కు తెలంగాణ వచ్చిన తర్వాత అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయి. ఆయనను సిఎం కేసిఆర్ ఛీదరించుకుని దగ్గరకు రానీయలేదు. మొహం చూడడానికే ఇష్టపడలేదు. దీంతో కోదండరాం ప్రతిపక్ష పాత్రలోనే మెలిగారు. తుదకు రేవంత్ సమక్షంలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని పార్టీలో చర్చలు ఊపందుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...