ఆ బాలుడి నాలుక ప‌చ్చ‌గా మారింది చివ‌ర‌కు ప‌రీక్ష‌లు చేస్తే

The boy tongue became yellow colour

0
102

మ‌నం చూస్తు ఉంటాం కామెర్లు వ్యాధి వ‌స్తే వారికి క‌ళ్లు ప‌చ్చ‌గా మారిపోతాయి. వారు క‌చ్చితంగా మెడిస‌న్ వెంట‌నే వాడ‌తారు. వైద్యులు కూడా కామెర్ల వ్యాధి వ‌స్తే క‌చ్చితంగా ఆస్ప‌త్రికి వెళ్లాలి అని చెబుతారు. అయితే ఫీవ‌ర్ .జ్వ‌రం మూత్రం ప‌చ్చ‌గా రావ‌డం ఇవ‌న్నీ కామ‌న్ గా క‌నిపిస్తాయి.
కెనడాకు చెందిన ఓ 12 ఏళ్ల బాలుడికి మాత్రం నాలుక పసుపు పచ్చగా అయిపోయింది.

ఇప్ప‌టి వ‌ర‌కూ ఎక్క‌డా గుర్తించలేదు ఇలాంటిది. అయితే వైద్యులు కూడా దీనికి కార‌ణం తెలియ‌చేస్తున్నారు. ముఖ్యంగా మూత్రం ఎర్రగా వస్తోంది. దీనికి కారణం ఎర్ర రక్తకణాలను మన రోగనిరోధక వ్యవస్థ చంపేసే అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని వైద్యులు తేల్చారు.ఇది చాలా రేర్ గా బ‌య‌ట‌ప‌డుతుంది అని తెలిపారు వైద్యులు.

బాబుకి బొంగురు గొంతు, ఎర్రటి మూత్రం, కడుపు నొప్పి, చర్మం వాడిపోవడం ఇలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌టంతో వెంట‌నే ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు. ముందు కామెర్లు అనుకున్నారు. కానీ నాలుక పచ్చగా మారడం చూసి మరిన్ని పరీక్షలు చేయించారు. రక్తహీనత ఉందని నిర్ధారించారు. ఎర్ర రక్తకణాలను చంపేసే కోల్డ్ అగ్లుటినిన్ అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్నట్టు తేల్చారు. బాగా చ‌లి వ‌ల్ల ఈ జ‌బ్బు వ‌స్తుంది అని తేల్చారు . ఏడు వారాలు బాలుడికి చికిత్స ఇచ్చారు ప్ర‌స్తుతం అత‌ను కోలుకుంటున్నాడు.