లక్కీ గేదె సింహాలకు చిక్కి భలే ఎస్కేప్ అయింది – వీడియో వైరల్

The buffalo escaped trapped by the lions

0
118

ఒక్కోసారి అడవిలో పెద్ద పెద్ద జంతువులు కూడా పోట్లాడుకుంటాయి. ఈ సమయంలో వాటికి చిక్కిన ఆహారం కూడా పక్కన పెడతాయి. ఎందుకంటే వాటి పోట్లాట ఆ విధంగా ఉంటుంది. సింహాం అడవికి రాజు అంతేకాదు దానికి ఏదీ అడ్డురాదు. అది దేనిపైన అయినా గురి పెట్టి వేటాడిందో ఇక అది దానికి ఫుడ్ అయిపోతుంది.

మనకు తెలిసిందే సింహాలు గానీ, చిరుత పులులు గానీ ఎప్పుడు పడితే అప్పుడు వేట సాగించవు. వాటికి బాగా ఆకలి అనిపించినప్పుడు మాత్రమే ఇతర జంతువులను ఇవి వేటాడుతాయి. ఒక్కోసారి పక్కన ఏదైనా జంతువు వెళుతున్నా పట్టించుకోవు. కాని ఆకలిగా ఉంటే మాత్రం దానిని ఆహారంగా తీసుకుంటాయి. ఆ వేట ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

తాజాగా ఒక వీడియో వైరల్ అవుతోంది. నాలుగు సింహాల మంద ఓ గేదెను వేటాడాయి. దానిని వదలకుండా పట్టుకున్నాయి. ఇంతలో వీటిలో ఇవే పోట్లాడుకున్నాయి. చివరకు నాలుగు సింహాలు పక్కకు వెళ్లిపోయాయి పోట్లాటతో. ఇంతలో ఈ గేదె బతుకు జీవుడా అని పారిపోయింది. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియో మీరు చూసేయండి

https://twitter.com/i/status/1419238516354060290