నాగుపాముని ఇంటి ముందు ఆపేసిన పిల్లి – ఈ వీడియో చూడండి

The cat that stopped the cobra in front of the house- viral video

0
94

పాముని చూస్తే కొన్ని జంతువులు అస్సలు పారిపోవు .వాటితో పోరాటం అయినా చేస్తాయి వాటిని అస్సలు వదిలిపెట్టవు. ఇందులో కుక్క, ముంగీస, పిల్లి కూడా ఉంటాయి. అవి వాటిపైకి వస్తున్నా బెదరకుండా వాటిని పారిపోయేలా చేస్తాయి. ఒడిశాలోని భీమసాంగి ప్రాంతంలో సంపత్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లోకి ఓ నాగుపాము ప్రవేశించింది.

పెరట్లోకి వస్తున్న ఆ విషసర్పాన్ని సంపత్ కుమార్ పెంపుడు పిల్లి చిన్ను గుర్తించింది. అది లోపలకి రాకుండా అక్కడ అడ్డుకుంది కాని ఆ నాగుపాము కాటు వేయాలి అని దాని వంక చూస్తు ఉండిపోయింది. కాని ఆ పిల్లి మాత్రం భయం లేకుండా దైర్యంగా నిలిచింది.

ఓ కుక్క అరవడంతో సంపత్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులు అక్కడకు వచ్చి చూడగా, బుసలు కొడుతూ తాచుపాము కనిపించింది. వెంటనే స్నేక్ వాలంటీర్ కి సమాచారం ఇస్తే అతను వచ్చి ఆ పాముని పట్టుకున్నాడు. ఇక వెంటనే సంపత్ ఆ పిల్లిని ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. దానిని పాము కరిచించా అనే అనుమానంతో చూపించాడు. ఎలాంటి కాటు వేయలేదు అని తెలిపారు వైద్యులు.

ఈ వీడియో చూడండి.

https://twitter.com/otvnews/status/1417761975346597890