Breaking: ధోనిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కోచ్

0
79

మామూలుగా వివాదాలకు దూరంగా ఉండే ధోని  ఎప్పుడు కూల్ గానే ఉంటాడు. అలాంటి ధోనీపై  రైజింగ్ పూణే సూప‌ర్ జెయింట్స్ మాజీ ప‌ర్ఫామెన్స్ అన‌లిస్ట్ కోచ్ అఘోరమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2016 ఐపీఎల్ సీజ‌న్ లో రైజింగ్ పూణే సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు కెప్టెన్ గా ధోని, పూణే జ‌ట్టుకు ప‌ర్ఫామెన్స్ అన‌లిస్ట్ కోచ్ గా వ్య‌వ‌హ‌రించాన‌ని అఘోరామ్ అన్నాడు. జ‌ట్టు ప్రణాళిక‌లు, వ్యూహాలపై చ‌ర్చ జ‌రిగిన‌ప్పుడు.. త‌న‌కు ధోని వార్నింగ్ ఇచ్చాడ‌ని ఆరోపించాడు. తన‌తో ధోని… అడ‌గ‌నిదే స‌లహాలు ఇవ్వొద్ద‌న్నార‌ని ఆరోపిచారు. అలాగే మీటింగ్ కు కూడా రావాల‌ని పిల‌వ‌కండి అని ధోని అన్నాడంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.