ముగిసిన తొలి రోజు ఆట..టీమిండియా స్కోరు ఎంతంటే?

The first day of the game ended .. What is the score of Team India?

0
97

భారత్- శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి  టీమిండియా 85 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (45), రవిచంద్రన్ అశ్విన్ (10) క్రీజులో ఉన్నారు. కాగా చివరి 10 ఓవర్లలో టీమిండియా 80 పరుగులు సాధించడం విశేషం. పంత్ 96 పరుగులతో ఆకట్టుకోగా శ్రేయస్ అయ్యర్ (27), తన 100వ టెస్టులో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీకి 5 పరుగులు దూరంలో పెవిలియన్ చేరాడు. 45 పరుగుల వద్ద ఎంబుల్దియాన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.