క్రికెట్ లో సరికొత్త ఫార్మాట్ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు

The newest format in cricket is the England Cricket Board

0
100

క్రికెట్ ని చాలా దేశాల్లో అభిమానించే వారు ఉన్నారు. కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒకదేశం మ్యాచ్ జరుగుతున్నా పక్కదేశం వారు చూస్తూ ఉంటారు. క్రికెట్ అంటే అంత అభిమానం క్రేజ్ ఉంటుంది.
క్రీడాకారుల ఆటకు మంచి రాబడి ఉంటుంది. కోట్లు సంపాదించిన క్రికెటర్లు ఉన్నారు.
ఐదు రోజుల టెస్టు క్రికెట్, 50 ఓవర్లతో వన్డేలు, టీ20 క్రికెట్, టీ10 లీగ్ పేరిట ఇప్పటి వరకూ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నాయి.

కానీ తాజాగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఇప్పుడు 100 అనే సరికొత్త ఫార్మాట్ ను పరిచయం చేస్తోంది. సో టీ 20 ఎంత పాపులర్ అయిందో ఇది కూడా అలా అవుతుంది అని అందరూ భావిస్తున్నారు. ఈ మ్యాచ్ ఎలా అంటే ఒక్కో టీమ్ 100 బాల్స్ ఆడాల్సి ఉంటుంది. ఇక ఓవర్ కాకుండా సెట్ ఉంటుంది. సెట్ కి ఐదు బాల్స్ ఉంటాయి

ప్రస్తుతం ఇంగ్లండ్ లో ది 100 టోర్నీ జరగనుంది. అంతేకాదు ఇప్పుడు ఆటకు భిన్నంగా ఒక బౌలర్ ఒకేసారి రెండు సెట్లు వేయాల్సి ఉంటుంది. ఇక సెట్ పూర్తి అయ్యాక ఎంపైర్ వైట్ కార్డ్ చూపిస్తారు అక్కడకు సెట్ అయింది అని అర్దం. మళ్లీ ఆ బౌలర్ రెండో సెట్ వేస్తాడు
తొలి 25 బంతులకు పవర్ ప్లే వర్తిస్తుంది. పవర్ ప్లే సమయంలో 30 గజాల సర్కిల్ వెలుపల ఇద్దరు ఫీల్డర్లే ఉండాలి. ఇక అందరికి డౌట్ మరి మ్యాచ్ టై అయితే ఇద్దరు టీమ్ లకి ఒకో సెట్ బాల్స్ వేస్తారు.