ఐపీఎల్ మెగా వేలం విజయవంతంగా ముగిసింది. మొత్తం10 ఫ్రాంచైజీలు భారతీయ, విదేశీ ఆటగాళ్ల కోసం అధికంగా ఖర్చు చేశాయి. ఇషాన్ కిషన్ రూ.15.25 కోట్తో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారాడు. ఇక ఇవాళ రెండో రోజు వేలం మరికాసేపట్లోనే ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో… ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం కానుంది.
ఇవాళ జరిగే వేలంలో ఏ ప్లేయర్లు వేలంలో ఉంటారోనని అందరిలోనూ సందిగ్ధత నెలకొంది.ఇవాళ జరిగే వేలంలో ఆరోన్ ఫించ్, లబుషెన్, డేవిడ్ మాలాన్, నిషం, ఇయాన్ మోర్గాన్, మర్క్రం, చటేశ్వర్ పుజారా, రహానే, లివింగ్ స్టోన్, ఖలీల్ అహ్మద్, బోర్ డాన్, మార్కో జన్సాన్, పాల్ స్ట్రిలింగ్, శ్రీశాంత్, షైనీ, ఓడెన్ స్మిత్, రూథర్ ఫర్డ్, శివమ్ దూబే, సందీప్ శర్మ, ఇషాంత్ శర్మ, కేదార్ జాదవ్, సకారియా, మయాంక్ మార్కండే, విజయ శంకర్, గౌతమ్, యశ్ దుల్, రాజ్ భవ వీరితో పాటు భారత అండర్-19 ప్రపంచకప్ విజేత జట్టు కెప్టెన్ యశ్ ధుల్, రాజ్ అంగద్ బావా వంటి యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు.
మొదటి సెషన్‌లో వేలంలోకి వచ్చే కీలక ప్లేయర్లు
ఐడెన్ మార్క్రామ్
ఇయాన్ మోర్గాన్
అజింక్యా రహానే
మార్కో జాన్సెన్
లియామ్ లివింగ్‌స్టోన్
జిమ్మీ
నీషమ్ ఓడియన్ స్మిత్
నాథన్ కౌల్టర్-నైల్
లుంగి ఎన్‌గిడి
చేతన్ సకారియా
జయదేవ్ ఉనద్కత్
రాజ్ అంగద్ బావా
రాజవర్ధన్ హంగర్కర్
యష్ ధుల్
విక్కీ ఓస్త్వాల్