ఒక్కో మామిడి పండు ధర రూ.1500 – దీని స్పెషాలిటీ ఏమిటంటే

The price of each mango fruit is Rs.1500. nurjahan mango special story

0
120

వేసవి వచ్చిందంటే చాలు మామిడిపండ్లు మార్కెట్లో ఎక్కువగా లభిస్తాయి. ఇక మామిడిలో కొన్ని వందల రకాలు ఉన్నాయి. వైద్యులు కూడా ఈ సీజన్ లో రోజు ఓ మామిడిపండు తీసుకోమని చెబుతారు. చెప్పాలంటే పండ్లు అన్నింటిలో ఇది రారాజు.మన దేశంలో ఓ మామిడిపండు మాత్రం చాలా స్పెషల్ దాని గురించే చెప్పుకుందాం.

మధ్యప్రదేశ్ కు చెందిన నూర్జాహాన్ రకం మామిడిపండు చాలా ప్రత్యేకం. ఎందుకంటే మనం కొబ్బరిమామిడి చూస్తాం, దాదాపు అరకిలో అయినా బరువు తూగుతాయి. కొన్ని అయితే ముప్పావు కిలో కూడా తూగుతాయి. ఇక నూర్జాహాన్ రకం అయితే ఏకంగా రెండు మూడు కిలోలు బరువు ఉంటుంది. దీని ధర కాయ ఒక్కొక్కటి రూ.1000 నుంచి రూ.2000 వరకూ ఉంటుంది.

మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలో నూర్జహాన్ మామిడి పళ్లకు బాగా పేరు .కేవలం కత్తివాడ ప్రాంతాల్లో మాత్రమే ఈ మామిడి పండిస్తారు. వీటిని మార్కెట్ కు తీసుకువెళ్లి అమ్మరు. తోట దగ్గరకు వచ్చి చాలా మంది అడ్వాన్స్ ఇచ్చి కొనుక్కుంటారు. రైతులు ప్రతీ ఏడాది 10 లక్షల వరకూ సంపాదిస్తున్నారు. ఈ ఏడాది ఓ రైతు తోటలో ఓ పండు 3.75 కిలోలు పండింది ఇదే రికార్డ్ .