అడవి కాకర. లేదా ఆకాకర, లేదా ఆగాకర , బోడు కాకర ఇలా ఏ పేరు పెట్టి పిలిచినా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇక చాలా మంది పొట్టి కాకరకాయ చిన్ని కాకరకాయ అంటారు. ఈ కూర వండుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాదు ఆరోగ్యానికి కూడా ఎన్నో పోషకాలను అందిస్తుంది.
ఇక మార్కెట్లో ఇది రేటు ఎక్కువే ఉంటుంది కాని ఆ రేటుకి తగ్గ పోషకాలు అందిస్తుంది. కాకర చేదు ఉంటుంది. కానీ ఈ ఆగాకరకాయ చేదు ఉండదు. ఇక షుగర్ సమస్య ఉన్న వారు కూడా దీనిని తీసుకోవచ్చు.
ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి ఇన్సులిన్ లెవల్స్ని పెంచుతుంది. ఇక క్యాన్సర్ సమస్యలు రాకుండా చూస్తుంది. గర్భిణీ స్త్రీలు కూడా వైద్యులని అడిగి వీటిని తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక వ్యవస్థ బాగుంటుంది. కంటి సమస్యలు ఉండవు. కిడ్నీ వ్యాధి ఉన్న వారు వారానికి ఓసారి అయినా ఇది తీసుకుంటే ఎంతో మంచిది. ఇక ఫైబర్ ఉండటం వల్ల మీకు జీర్ణక్రియ బాగుంటుంది. గ్యాస్ ,అసిడిటీ, మలబద్దక సమస్యలు తగ్గిపోతాయి.