IPL Auction: అత్యధిక ధర పలికిన బౌలర్లు వీరే..!

0
156

ఐపీఎల్ తొలి రోజు వేలం పూర్తైంది. ఈ వేలంలో బౌలర్లు మంచి ధర పలికారు. టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్‌ దీపక్‌ చాహర్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ దక్కించుకుంది. అతడిని రూ.14 కోట్లకు సీఎస్కే సొంతం చేసుకుంది.

కనీస ధర రూ.2 కోట్లు ఉన్న శార్దూల్‌ ఠాకూర్‌ను దిల్లీ క్యాపిటల్స్‌ రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది.

గత సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన హర్షల్‌ పటేల్‌, శ్రీలంక స్పిన్నర్‌ వానిందు హసరంగలకు చెరో రూ.10.75 కోట్లు వెచ్చించి రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు సొంతం చేసుకుంది.

అలానే అవేశ్‌ ఖాన్‌ రూ. 20 లక్షల కనీస ధరతో ప్రారంభమై రూ. 10 కోట్లకు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది.

న్యూజిలాండ్‌ బౌలర్‌ లాకీ ఫెర్గూసన్‌ని గుజరాత్ టైటాన్స్‌ దక్కించుకుంది. అతడి కనీస ధర రూ.2 కోట్లు కాగా.. రూ.10 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది.

విండీస్‌ ఫాస్ట్‌బౌలర్‌ జేసన్‌ హోల్డర్‌ని రూ.8.75 కోట్లు, కృనాల్ పాండ్యను రూ.8.25 కోట్లకు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ దక్కించుకుంది.

గత సీజన్‌ వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడిన ప్రసిద్ధ్‌ కృష్ణ ఈ సీజన్‌ నుంచి రాజస్థాన్‌ రాయల్స్‌ జెర్సీలో కనిపించనున్నాడు. అతడి కనీస ధర రూ. కోటి కాగా.. రూ.10 కోట్ల భారీ మొత్తానికి రాజస్థాన్‌ సొంతం చేసుకుంది.

దక్షిణాఫ్రికా బౌలర్‌ కగిసో రబాడను రూ.9.25 కోట్లకు పంజాబ్ కింగ్స్‌ దక్కించుకుంది.

వాషింగ్టన్‌ సుందర్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్ రూ.8.75 కోట్లకు సొంతం చేసుకోగా..

న్యూజిలాండ్ బౌలర్‌ ట్రెంట్ బౌల్ట్‌ని రాజస్థాన్ రాయల్స్‌ రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది.

జోష్‌ హేజిల్‌వుడ్‌ని రూ. 7.75 కోట్లకు ఆర్‌సీబీ సొంతం చేసుకుంది.

ప్యాట్‌ కమిన్స్‌ని రూ.7.25 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దక్కించుకుంది.

టీమ్ఇండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ని రూ.6.50 కోట్లకు రాజస్థాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది.