IPL 2022: ఐపీఎల్​ బయోబబుల్​ కొత్త నిబంధనలు ఇవే..

0
103

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 మార్చి 26న ప్రారంభం కానుంది. కాగా ఈ ఏడాది కొత్తగా గుజ‌రాత్ తో పాటు ల‌క్నో రెండు ఫ్రొంచైజీలు ఆడ‌బోతున్నాయి. మొత్తం 10 జట్లు ఈ సీజన్ లో పాల్గొననున్నాయి. తాజాగా ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ రిలీజ్ అయింది. గత సీజన్​లో​ ఛాంపియన్స్​గా నిలిచిన చెన్నై సూపర్​ కింగ్స్​, రన్నరప్​గా ఉన్న కోల్​కతా నైట్​రైడర్స్​ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

ఈ నేపథ్యంలో బీసీసీఐ కఠినమైన బయోబబుల్​ నిబంధనలను ప్రకటించింది. ఆటగాళ్లతో పాటు కుటుంబసభ్యులకు కూడా నిబంధనలు అమలులో ఉంటాయని బోర్డు పేర్కొంది. వాటిని ఉల్లంఘిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరించింది.

ఏ జట్టు ఆటగాడైనా తొలిసారి బుడగ దాటితే సదరు ఫ్రాంచైజీకి రూ.కోటి జరిమానా విధిస్తామని బీసీసీఐ తెలిపింది. రెండో సారి ఇదే జరిగితే ఒక పాయింట్ కోత, మూడో సారికైతే రెండు పాయింట్ల కోత ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది.

కోవిడ్ టెస్ట్‌కు నిరాకరించే వ్యక్తులకు తొలిసారి మందలింపు ఉంటుందని బీసీసీఐ వెల్లడించింది. ఇక రెండో సారి కూడా నిరాకరిస్తే రూ.75వేల జరిమానాతో పాటు స్టేడియంలోకి అనుమతించబోమని పేర్కొంది.