డేవిడ్ వార్నర్ మన తెలుగు వారికి బాగా దగ్గర అయ్యాడు బుట్టబొమ్మ సాంగ్ తో.. ఇక ఆటలో కూడా అద్బుతమైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంటాడు వార్నర్, ఓపెనర్ గా బ్యాటింగ్ అద్బుతంగా చేస్తాడు, అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాలో టీమీండియా అక్కడ వన్డే పోరులో ఉంది.
టీమిండియాతో మిగిలిన వన్డేతో పాటు మూడు టీ20ల సిరీస్కు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఇది అభిమానులకి షాక్ ని ఇచ్చింది. నిన్న మ్యాచ్ లో డేవిడ్ కు గాయం అయింది,
తొడ పై భాగంలో గాయం కారణంగా డేవిడ్ వార్నర్ కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. మరి టెస్టులు ఆడతారా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
టీ20 సిరీస్కు వార్నర్ స్థానంలో డీ ఆర్సీ షార్ట్కు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అని అక్కడ స్పోర్ట్స్ అనలిస్టులు భావిస్తున్నారు, అయితే సరైన సమయంలో ఇలా దూరం అవ్వడంతో డేవిడ్ అభిమానులు కాస్త ఫీల్ అవుతున్నారు, రెండు వన్డేట్లో టీమ్ ఇండియా దారుణంగా ఓటమి పాలైంది.