ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్వార్న్(52) హఠాన్మరణం చెందారు. అయితే షేన్ వార్న్ తన మరణానికి కొన్ని గంటల ముందు ఈరోజు ఉదయం 7.23 నిమిషాలకు చివరి ట్విట్ చేశాడు. ఆస్ట్రేలియా క్రిెకెట్ దిగ్గజ వికెట్ కీపర్ రాడ్ మార్ష్ గుండెపోటుతో మరణించగా..వార్న్ ఆయనకు నివాళి అర్పించాడు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నట్లు రాసుకొచ్చాడు. ఇంతలోనే కొన్ని గంటల వ్యవధిలోనే షేన్ వార్న్ గుండెపోటుతో కానరాని లోకాలకు చేరడం యావత్ క్రికెట్ అభిమానులను శోఖసంద్రంలో ముంచింది.