టీమ్ఇండియా అత్యంత పేలవ ప్రదర్శన ఇదే..బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

This is Team India's worst performance. BCCI President Ganguly interesting comments

0
98

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు వైఫల్యంపై బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్‌ఇండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ స్పందించాడు. ‘గత నాలుగైదేళ్లలో నేను చూసిన టీమ్ఇండియా ప్రదర్శనల్లో ఇదే అత్యంత పేలవంగా ఉంది’ అని పేర్కొన్నాడు.

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్లపై ఓటమిపాలైన భారత్‌..మిగతా మూడు మ్యాచ్‌లు (అఫ్గాన్‌, నమీబియా, స్కాట్లాండ్‌) గెలిచినా నాకౌట్‌ దశకు చేరుకోలేకపోయింది. అంతేకాకుండా తొలిసారి ప్రపంచకప్‌ టోర్నీల్లో పాక్‌ చేతిలో ఓడిపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్‌ కప్‌లో టీమ్‌ఇండియా మంచి ప్రదర్శన చేసిందని, అయితే 2021 టీ20 ప్రపంచకప్‌లో మాత్రం తన స్థాయి ఆటను ఆడలేదని గంగూలీ వివరించాడు.

పాక్‌పై పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన టీమ్‌ఇండియా.. కివీస్‌ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. పాక్‌తో మ్యాచ్‌లో ఒత్తిడికి గురైన భారత్‌ కనీసం పోరాటం కూడా చేయలేకపోయింది. దీనిపై గంగూలీ స్పందిస్తూ.. “ఈ ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారని భావిస్తున్నా. కారణం ఏంటో తెలియదు. అయితే ఇలా ఎందుకు జరిగిందని కొన్నిసార్లు కారణాలను వేలెత్తి చూపలేరు” అని గంగూలీ విశ్లేషించాడు.