భారత్​తో తలపడే కివీస్ జట్టు ఇదే..!

This is the Kiwis team that will face India ..!

0
97

టీమ్​ఇండియాతో జరగబోయే టీ20, టెస్టు సిరీస్​ల కోసం జట్టును ప్రకటించింది న్యూజిలాండ్. ఈ పర్యటనలో భాగంగా ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. బయోబబుల్​ కారణంగా​ పేసర్ ట్రెంట్ బౌల్ట్, ఆల్​రౌండర్ కొలిన్ డీ గ్రాండ్​ హోమ్​ టెస్టు సిరీస్​కు దూరమవుతున్నారని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పేర్కొంది.

భారత్, కివీస్​ మధ్య టీ20 సిరీస్ నవంబర్ 17-21 మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ జైపూర్(నవంబర్ 17), రెండో మ్యాచ్ రాంచీ(నవంబర్ 19), మూడో మ్యాచ్ కోల్​కతా(నవంబర్ 21) వేదికగా జరగనున్నాయి. అనంతరం భారత్​తో టెస్టు మ్యాచ్​లు ఆడనుంది కివీస్. నవంబర్ 25-29 మధ్య కాన్పుర్​లో తొలి టెస్టు, డిసెంబర్ 3-7 మధ్య ముంబయి వేదికగా రెండో టెస్టు జరగనుంది.

న్యూజిలాండ్(టెస్టు జట్టు):

కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), టామ్ బ్లండెల్ (వికెట్‌ కీపర్‌), డెవాన్ కాన్వే, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోలస్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, విల్ సోమర్‌విల్లే, టిమ్ సౌథీ, రాస్ టేలర్, విల్ యంగ్

న్యూజిలాండ్(టీ20 జట్టు):

కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), టాడ్ ఆస్టిల్, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, మార్టిన్ గప్తిల్, కైల్ జేమీసన్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెట్ (వికెట్‌ కీపర్‌), ఇష్ సోధి, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే