భారత్‌తో తలపడే పాకిస్తాన్ టీం ఇదే..!

This is the Pakistan team that will face India ..!

0
78

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది క్రికెట్ అభిమానులు తమ టీవీలకు అతుక్కుపోయే సమయం వచ్చింది. దాదాపు 30,000 మంది ప్రేక్షకులు ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉత్కంఠ మ్యాచును వీక్షించేందుకు సిద్ధమయ్యారు.

భారత్‌ వర్సెస్ పాకిస్తాన్ టీంలు తమ తొలి సమరాన్ని అక్టోబర్ 24న ఆదివారం దుబాయ్‌లో మొదలుపెట్టనున్నారు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో ఎంతో ముఖ్యమైన మ్యాచ్ కావడంతో రేపటి పోరుపై ఇరుదేశాల అభిమానులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇద్దరు మాజీ ఛాంపియన్‌ల మధ్య మ్యాచ్ రాత్రి 7.30లకు మొదలుకానుంది.

అయితే బరిలోకి దిగే ప్లేయింగ్ XIపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంచనాలు పటాపంచలు చూస్తూ భారత్‌తో బరిలోకి దిగే ప్లేయింగ్ స్క్వాడ్‌ను ప్రకటించింది.  బాబర్ అజామ్, అసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ బ్యాట్స్‌మెన్లు కాగా, మహ‍్మద్ రిజ్వాన్ కీపర్ కం బ్యాట్స్‌మెన్, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, షాదాబ్ ఖాన్, షోయబ్ మాలిక్ ఆల్‌రౌండర్లుగా బరిలోకి దిగనున్నారు. అలాగే హారిస్ రౌఫ్, హసన్ అలీ, షహీన్ షా అఫ్రిదీ బౌలర్లుగా బరిలోకి నిలవనున్నారు.