కోల్ కత్తా నైట్ రైడర్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగి రెండు రోజులు అయినా చర్చజరుగుతూనే ఉంది, ఇదేంటి ఇలా ఆడారు అని అందరూ విమర్శించారు, అభిమానులు సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్లు చేశారు అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో అత్యంత దారుణమైన ఇన్నింగ్స్ గా నమోదు అయింది.
కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు దినేష్ కార్తీక్ కెప్టెన్సీలో పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది . చివరకు దినేష్ కార్తీక్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. రధసారధిగా ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. ఇక మోర్గాన్ కెప్టెన్సీ లోకి వచ్చిన తర్వాత జట్టు పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిపోయింది.
విజయాలు లేవు అపజయాలు వస్తున్నాయి, బౌలింగ్ బ్యాటింగ్ రెండింటిలోను విఫలం అవుతున్నారు,
కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు ప్రత్యర్థి జట్టుకు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. కేవలం ఎనిమిది వికెట్లు కోల్పోయి 85 పరుగులు మాత్రమే చేసింది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 39 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్ల నష్టానికి టార్గెట్ ను ఈజీగా దాటేసి విజయం సాధించారు.. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే మొదటిసారిగా చెత్త రికార్డు నమోదు అయింది.