పేసర్ శార్దూల్ ఠాకూర్‌ను ఇండియా ఏ జట్టుకు ఎంపిక చేశారు. అతన్ని దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సిందిగా సెలెక్టర్లు ఆదేశించారు. అలాగే బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌ను స్వదేశంలో న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు ఆడనున్న భారత టెస్టు జట్టుతో కలిసి ఉండాలని చెప్పారు.
శార్ధూల్ న్యూజిలాండ్‌తో జరిగిన టీ20, టెస్ట్ జట్టులో లేడు. కొత్త ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రతి ఆటగాడు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే ముందు పలు మ్యాచ్‌లు ఆడాలని కోరుకున్నట్లు తెలిసింది. వచ్చే నెలలో జరిగే దక్షిణాఫ్రికా సిరీస్‌కు శార్దూల్‌ను ఎంపిక చేయకపోతే అతడికి చాలా గ్యాబ్ వచ్చేది.
ఠాకూర్ ఆస్ట్రేలియా, ఆ తర్వాత ఇంగ్లండ్‌లో జరిగిన టెస్టుల్లో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గో టెస్టులో అతను రెండు అర్ధ సెంచరీలతో రాణించాడు. కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టు తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు బీసీసీఐ జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. జట్టులో ఇప్పటికే శ్రేయస్ అయ్యర్‌ను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా చేర్చారు. అతనికి టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి.