ఈ సోషల్ మీడియాలో సెలబ్రెటిలని కొందరు ఆకతాయిలు వారి ఫోటోలని మార్ఫింగ్ చేసి ఇబ్బందులకి గురిచేస్తూ వారిని బెదిరిస్తూ డబ్బులు దండుకుంటున్నారు.. కాదు అంటే ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తున్నారు, ఇలాంటి వారి ఆట కట్టిస్తున్నారు పోలీసులు.
తాజాగా టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ తన భర్తకు దూరంగా ఉంటున్నారు, అయితే ఆమెకి ఇలాంటి వేధింపులు వస్తున్నాయి ఓ వ్యక్తి నుంచి….కోల్ కతాకు చెందిన 25 ఏళ్ల వ్యక్తి ఆమెకు తరచూ ఫోన్లు చేస్తూ వేధిస్తున్నాడు, తనకు డబ్బులు ఇవ్వాలి అంటున్నాడు, దీనిపై కొన్ని వందల సార్లు ఫోన్లు చేసి ఆమెని టార్చర్ చేశాడు.
డబ్బులు ఇవ్వకపోతే వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని, దుండగుడు బెదిరిస్తున్నాడని ఇక విసుగుచెంది ఆమె పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది, మొత్తానికి అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎవరిని అయినా ఇలా బెదిరించాడా అనేది తెలుసుకుంటున్నారు విచారణలో పోలీసులు.