టివి చర్చల్లో తెలంగాణవాదాన్ని బలంగా వినిపించాను : కృష్ణమోహన్

-

ఉమ్మడి రాష్ట్రంలో బిసి కమిషన్ కమిషన్ సభ్యులుగా పనిచేసిన వకులాభరణం కృష్ణమోహన్ రావు హటాత్తుగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆయన మీద మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమునారెడ్డి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఆమె చేసిన ఆరోపణలకు కృష్ణమోహన్ ఒక పత్రికా ప్రకటనలో కౌంటర్ ఇచ్చారు కూడా. కౌంటర్ లో ఆయన తన గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే తాను తెలంగాణ కోసం పనిచేశానని, టివి చర్చల్లో తెలంగాణవాదాన్ని బలంగా వినిపించానని గుర్తు చేసుకున్నారు. ఆయన ఇంకేమన్నారో పత్రికా ప్రకటనలో ఉన్న విషయాలను దిగువన యదాతదంగా ఇస్తున్నాము… చదవొచ్చు.

- Advertisement -

నా జీవితంలో ఒక్క విషయాన్ని మాత్రం గొప్పగా చెప్పుకుంటాను. అది 2004 సంవత్సరంలో
కేప్టెన్‌ వి.లక్ష్మికాంతరావు (ప్రస్తుత రాజ్యసభ సభ్యులు) నాడు బిసి మంత్రిగా సిఫారసు చేసి నన్ను బిసి
కమిషన్‌ సభ్యుడిగా నియామకం చేయించారు. క్రమంగా నిబద్ధతతో పని చేస్తూ, నాటి ముఖ్యమంత్రి
మన్ననలతో ఎమ్మెల్యే బి-ఫారం పొంది పోటీ చేయగలిగాను. పూజయంతో క్రుంగిపోకుండా నాదైన
పద్ధతిలో బిసి హక్కుల కోసం నిరంతరం పని చేస్తుందడం జీవితంలో ఒక భాగం చేసుకున్నాను.
నాడు కాంగ్రెస్‌ పార్టీలో కూదా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నాను.
పార్టీ అధికార ప్రతినిధిగా టి.వి. చర్చలలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించాను. కానీ నేను
ఏనాడూ వ్యక్తిగతంగా ఆస్తులు ‘పెంచుకోలేదు సరికదా, ఆస్తులు కోల్పోయాను, అప్పుల పాలయ్యాను.
ఇది ముమ్మాటికి వాస్తవం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈటల బడుగుల భూములు గుంజుకున్నారు.
నేను అధికారంలో ఉన్నా లేకున్నప్పటికి బిసి వర్ణాల సమగ్ర వికాసానికి కృషి చేస్తూనే వున్నాను.
2016 లో నా సేవలను గుర్తించి ముఖ్యమంత్రి కెసిఆర్‌ తెలంగాణ తొలి బిసి కమిషన్‌లో సభ్యుడిగా
నియామకం చేశారు. ఆ పదవిలో కూడా నా వర్ణాల అభ్యున్నతికి చిత్తశుద్ధిగా కృషి చేయడం
జరిగింది. ఈటల రాజేందర్‌కు నిజంగానే పదవులు ఇప్పించగలిగే శక్తే వుంటే ఇప్పటి వరకు
హుజూరాబాద్‌ నియోజకవర్గం నుండి రాష్ట్రస్థాయిలో ఎంతమందికి పదవులు ఇప్పించారు.
నియోజకవర్గంలోని నాయకులకు ఇదిగో-అదిగో అంటూ కాలం వెళ్లబుచ్చారు తప్ప ఒక్కరికైనా
పదవి ఇప్పించగలిగారా సమాధానం చెప్పాలి.

మీ అక్రమ ఆస్తులపై దర్యాస్త జరుపుతుంటే, మీరు జరుపకూడదంటూ గగ్గోలు పెడుతున్నారు.
నేను ఏమైనా అక్రమాస్తులు సంపాదించి వుంటే, ఆస్తులు పెంచుకొని వుంటే దర్యాప్తు జరుపవలసిందిగా
డిమాండ్‌ చేస్తున్నాను. ఇది వాస్తవం.

బలహీన వర్గాల సమున్నతికి మీరు చేసింది ఏమిటో మీ మనస్సాక్షికి తెలుసు. రేపటి ఎన్నికలలో
బలహీన వర్గాలే మీ అహంకారాన్ని వదలదీసి బుద్ధి చెబుతారు. ఇది రేపటి వాస్తవం.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియాలో ఎంటరైన మెటా AI

భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది....

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్...