మెగా ఫ్యామిలి నుండి మరో హీరో ఎంట్రీ

మెగా ఫ్యామిలి నుండి మరో హీరో ఎంట్రీ

0
99

మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది అయితే ఈ సినిమాని ఎలాంటి హడావుడి లేకుండా మొదలుపెట్టారు . చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎం బిబిఎస్ చిత్రంలో వైష్ణవ్ తేజ్ నటించాడు , ఆ సినిమాలో కుర్చీకే పరిమితమైయ్యే చిన్న కుర్రాడి పాత్ర ఉంది కదా ! ఆ కుర్రాడే మెగా స్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ . సాయిధరమ్ తేజ్ కి తమ్ముడు . ఇతడికి కూడా సినిమాల్లో నటించాలి ఆసక్తి ఉండేది అయితే యాక్టింగ్ లో , డ్యాన్స్ లో శిక్షణ తీసుకొని ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చాడు .

ఇక ఈ సినిమాకు దర్శకుడు ఎవరో తెలుసా …… ” అప్పట్లో ఒకడుండేవాడు ” వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సాగర్ చంద్ర . నారా రోహిత్ , శ్రీవిష్ణు ల కాంబినేషన్ లో వచ్చిన అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంతో తన ప్రతిభ ని నిరూపించుకున్నాడు సాగర్ చంద్ర . తాజాగా వైష్ణవ్ తేజ్ – సాగర్ చంద్ర ల కాంబినేషన్ లో మొదలైన ఈ సినిమా చడీచప్పుడు కాకుండా షూటింగ్ జరుపుకుంటోంది . ఇప్పటికే మెగా కుటుంబం నుండి హీరోలు , నటులు చాలామందే అయ్యారు వాళ్ళ సరసన ఈ వైష్ణవ్ తేజ్ చేరనున్నాడు .