వాజ్‌పేయి ఇక లేరు

వాజ్‌పేయి ఇక లేరు

0
162

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రిలో దాదాపు తొమ్మిది వారాల పాటు మృత్యువుతో పోరాడుతూ కన్నుమూశారు. మంగళవారం నుంచి ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణాన్ని ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు.

తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజపేయి.. 9 వారాలుగా ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో మంచానికే పరిమితమయ్యారు. మూత్రనాళాల ఇన్ఫెక్షన్‌, శ్వాస తీసుకోవడం కష్టం కావడం వంటి సమస్యలతో బాధపడుతున్న వాజ్‌పేయిని జూన్‌ 11న ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేర్చారు. నాటి నుంచి అక్కడే ఆయన చికిత్స పొందారు. మంగళవారం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సనందించారు. అయితే ఆయన మూత్రపిండాల్లో ఒకటే పనిచేస్తుండడం, బలహీనమైన ఊపిరితిత్తులు, మధుమేహం కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది.

వాజ్‌పేయి మరణవార్తతో యావత్ దేశం దు:ఖసాగరంలో మునిగిపోయింది. వాజపేయి వయసు 93 సంవత్సరాలు. జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న ఆయన నమిత అనే అమ్మాయిని దత్తత తీసుకుని, పెంచారు. వాజపేయి మరణంతో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. మరోవైపు, వాజపేయి నివాసం వద్దకు ప్రధాని మోదీ, బీజేపీ నేతలు చేరుకున్నారు.