వెంకటేష్ సినిమాలో తమిళ్ హీరో సూర్య

వెంకటేష్ సినిమాలో తమిళ్ హీరో సూర్య

0
105

విక్టరీ వెంక‌టేష్ గురు త‌ర్వాత కాస్త ల్యాంగ్ గ్యాప్ తీసుకున్నా, వ‌రుస‌గా సినిమాలు సైన్ చేస్తున్నారు.. మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చెయ్య‌డానికి వెంకీ ఎప్పుడూ సిద్ద‌మే.. ఇప్పుడు ఆయ‌న‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయాల‌ని చాలా మంది ద‌ర్శ‌కులు ఎదురుచూస్తున్నారు..

ఇక తాజాగా ఆయ‌న సెట్స్ పై పెట్టిన సినిమా ఎఫ్2..ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్.. ఈ సినిమాని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమా తరువాత వెంకటేష్ ఒక సినిమా చేస్తున్నాడు.. ఇందులో ఆయ‌న మేన అల్లుడు నాగ‌చైత‌న్యతో క‌లిసి వెంకీ న‌టించ‌నున్నారు. ఈసినిమాకి ద‌ర్శ‌క‌త్వం బాబి చేయ‌నున్నారు.ఇక వెంకీ మామ ఎఫ్ 2 సినిమాల‌తో పాటు మ‌రో సినిమా కూడా వెంకీ ప్లాన్ చేస్తున్నాడు అని తెలుస్తోంది.

వెంక‌టేష్ త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఓ ఎమోష‌న‌ల్ డ్రామాగా సినిమాని చెయ్యాలి అని చూస్తున్నార‌ట‌. ఈ క‌థ విన‌గానే వెంకీ ఈ సినిమా చేసేందుకు ఎస్ చెప్పార‌ని తెలుస్తోంది. ఇక పోలీస్ పాత్ర‌లు వెంకీకి బాగా సూట్ అవుతాయి.. ఈ సినిమాలో కూడా వెంకీ పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపిస్తారు అని తెలుస్తోంది….ఈ సినిమాలో తమిళ స్టార్‌ హీరో సూర్య కీలక పాత్రలో నటించనున్నాడట. మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.