అమెరికాలో విరాట్‌.. అనుష్క

అమెరికాలో విరాట్‌.. అనుష్క

0
117

టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. వెస్టిండీస్‌తో నెల రోజుల పర్యటన సందర్భంగా తొలి రెండు టీ20లు ఫ్లోరిడాలోని మియామీలో జరగనున్నాయి. తర్వాత మూడో టీ20తో పాటు, మూడు వన్డేలు, రెండు టెస్టులు వెస్టిండీస్‌లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి మియామీలో చక్కర్లు కొడుతున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా అనుష్క ప్రపంచకప్‌ సమయంలోనూ విరాట్‌కోహ్లీతో లండన్‌లో చక్కర్లు కొట్టారు. అప్పుడు కూడా అభిమానులు వారి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేశారు. ప్రపంచకప్‌ తర్వాత విరుష్క జంట ముంబయి ఎయిర్‌పోర్టులో కనిపించారు. ఇప్పుడు తాజాగా అమెరికాలో విహరిస్తున్నారు. విండీస్‌ పర్యటనకు దూరమైన ధోనీ స్థానంలో రిషబ్‌పంత్‌ జట్టులో చేరాడు. మరోవైపు గాయం నుంచి కోలుకున్న శిఖర్‌ ధావన్‌ విండీస్‌ పర్యటనకు సిద్ధమయ్యాడు.