ఆటగాళ్లు ఇద్దరికి గిఫ్ట్ లు ఇచ్చిన విరాట్ కోహ్లి

ఆటగాళ్లు ఇద్దరికి గిఫ్ట్ లు ఇచ్చిన విరాట్ కోహ్లి

0
95

ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లికి అందరూ వీరాభిమానులే, మ్యాచ్ లో తనదైన శైలిలో ఆటతో అలరిస్తాడు కోహ్లి, అయితే విరాట్ టీమ్ విజయాలతో దూసుకుపోతోంది, రాజస్తాన్ రాయల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

రాజస్తాన్ నిర్దేశించిన 155 పరుగుల టార్గెట్లో ఆర్సీబీ 19.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఇది ఆర్సీబీకి మూడో విజయం కాగా, రాజస్తాన్కు రెండో ఓటమి. ఈ సమయంలో కోహ్లి రాజస్తాన్ ఆటగాళ్లకు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు.

ప్రత్యేకంగా తెవాటియా, రియాన్ పరాగ్లతో చాట్ చేసి అభినందించారు కోహ్లి.. తెవాటియాకు తన జెర్సీని ఇచ్చాడు కోహ్లి.. రియాన్ పరాగ్కు బ్యాట్ను కానుకగా ఇచ్చాడు. తన స్వహస్తలతో బ్యాట్పై సంతకం చేసి పరాగ్కు అందజేశాడు కోహ్లి. ఈ బ్యాట్ ని తన ఇన్ స్టాలో ఫోటో షేర్ చేసుకున్నాడు పరాగ్.