విరాట్‌ కోహ్లి 100వ టెస్ట్‌..అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌

0
105

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్, రన్​మెషీన్​ విరాట్​ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. ఇప్పటివరకు 99 టెస్టులు ఆడిన విరాట్​ కోహ్లీ.. 50.39 సగటున 7962 పరుగులు చేశాడు. వీటిలో 27 శతకాలు ఉన్నాయి. అలాగే వన్డే, టీ20లోనూ విరాట్ ప్రదర్శన ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటివరకు ఎన్నో రికార్డులు తన పపేరిట లిఖించుకున్న కోహ్లీ ప్రతిష్టాత్మక 100వ టెస్టుకు సిద్ధం అవుతున్నాడు.

శ్రీలంకతో టెస్టు సిరీస్​లో భాగంగా తొలి టెస్టు మొహాలీలోని ఐఎస్​ బింద్రా స్టేడియంలో జరగనుంది. మరో టెస్టు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. మొహాలీ వేదికగా తన 100వ అంతర్జాతీయ టెస్టు ఆడనున్నాడు. కొవిడ్​ నేపథ్యంలో కొన్ని రోజులుగా అభిమానులకు స్టేడియంలోకి ప్రవేశం లేదు.

కానీ ప్రస్తుతం కరోనా విజృంభణ తగ్గడంతో అభిమానులను రాణిస్తారనే ఆశతో ఉన్నారు. కానీ వారికి నిరాశే మిగిలింది. మార్చి 4న జరిగే ఈ మ్యాచ్​ కు పంజాబ్​ క్రికెట్​ అసోసియేషన్​ ఫ్యాన్స్​కు ఆ అవకాశాన్ని కల్పించట్లేదు. కొవిడ్​ నేపథ్యంలో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించట్లేదని స్పష్టం చేసింది.