టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత క్రీడాకారుల్లో అత్యధిక సంపాదన ఉన్న వ్యక్తి అనే విషయం తెలిసిందే .. కోహ్లీ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు ఆమె గర్భవతి, జనవరిలో వీరికి బిడ్డ పుట్టనుంది, ఇక వీరిద్దరూ చేతి నిండా సంపాదనతో బిజీగా ఉన్నారు, అతను క్రికెట్ లో సంపాదిస్తుంటే.. మరోపక్క పలు ఎండార్స్ మెంట్ల ద్వారా కోట్ల రూపాయలు విరాట్ కు అందుతున్నాయి.
ఇక అనుష్క శర్మ బాలీవుడ్ క్వీన్ గా పలు సినిమాలు చేస్తూ కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటోంది.ఇద్దరి నెట్వర్త్ సుమారు రూ. 1200 కోట్లకు చేరిందని వార్తలు వినిపిస్తున్నాయి ముంబై నుంచి… ఇక్కడ ఒకటి గమనించాలి ఈ ఇద్దరి సంపాదనలో ప్రధాన భాగం అడ్వర్టైజ్మెంట్స్ ఒప్పందం ద్వారా వచ్చేవే ఉన్నాయి అని తెలుస్తోంది.
గత ఏడాది విరాట్ కోహ్లీ నెట్వర్త్ సుమారు రూ. 252.72 కోట్లు.. దాదాపు 900 కోట్ల వరకూ ఆస్తులు ఉంటాయి అని తెలుస్తోంది విరాట్ కు… ఇక అతనికి రెండు రెస్టారెంట్లు ఉన్నాయి, పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు విరాట్.
ఇక అనుష్కశర్మకు దాదాపు 350 కోట్ల వరకూ ఆస్తి ఉంటుంది.. ఆమె నెట్ వర్త్ 2018లో 45.83 కోట్లు.. అలాగే రూ.34 కోట్లు విలువ చేసే లగ్జరీ అపార్ట్మెంట్ గూర్గాన్ లో రూ. 80 కోట్ల విలువ చేసే ఆస్థులున్నాయని కూడా వార్తలు నాటి నుంచి వినిపించాయి.