విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు

Virat Kohli sensational comments

0
123

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్​కు అందుబాటులో ఉంటాననిటీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. రోహిత్​తో ఎలాంటి గొడవలు లేవని తెలిపాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లీ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చాడు.

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్​కు అందుబాటులో ఉంటా. విశ్రాంతి కావాలని బీసీసీఐని కోరలేదు. సౌతాఫ్రికా టూర్​లో టెస్టు సిరీస్​లో భాగంగా రోహిత్ సేవల్ని కోల్పోవడం పెద్ద లోటు. పరిమిత ఓవర్ల కెప్టెన్​గా ఇప్పటివరకు నేనందించిన సేవల పట్ల గర్వంగా ఉంది. రోహిత్​కు, నాకూ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. రెండేళ్లుగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చి అలసిపోయా” అని కోహ్లీ తెలిపాడు.

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దంటూ తాను కోహ్లీని కోరానని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల వెల్లడించాడు. ఇదే విషయమై ప్రెస్ కాన్ఫరెన్స్​లో మాట్లాడిన కోహ్లీ..టెస్టు జట్టు ప్రకటించే గంటన్నర ముందు నన్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు సెలెక్టర్లు చెప్పారు. నేను సరే అన్నా. అలాగే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని నన్ను ఎవరూ కోరలేదని కోహ్లీ తెలిపాడు.