టీ 20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు అసంతృప్తికి గురి చేసినట్లు మాజీ క్రికెటర్ అజయ్ జడేజా చెప్పాడు. టాస్ ఓడిన తర్వాత విరాట్ కోహ్లీ అండ్ కోను మొదట బ్యాటింగ్ చేయమని పాక్ కెప్టెన్ బాబర్ ఆజం కోరాడు. ఇది కూడా మ్యాచ్ ఓడిపోడానికి ఓ కారణమని చెప్పాడు. పాకిస్తాన్ పేసర్ షాహీన్ ఆఫ్రిది రోహిత్ శర్మను గోల్డెన్ డక్‌గా ఔట్ చేశాడని వెంటనే కేఎల్ రాహుల్‌ను కూడా పెవిలియన్ చేర్చాడని అన్నారు. పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ అత్యుత్తమంగా ఆడలేదని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా పేర్కొన్నాడు.
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కోహ్లీ పాకిస్తాన్ విజయాన్ని కొనియాడాడని..ఆ రోజు కోహ్లీ చెప్పింది విన్నాను. ‘2 వికెట్లు పడగానే.. మ్యాచ్‌లో వెనకడుగు వేశాం’ అని అన్నాడు. అది కాస్త నిరాశకు గురిచేసింది. విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు మిడిల్ ఆర్డర్లో ఉంటే..మ్యాచ్ ఊరికే చేజారదు. కనీసం బంతులైనా ఆడకముందే కోహ్లీ అలా ఆలోచించడం మొదలుపెట్టాడు. అదే టీమ్ఇండియా ఆలోచనా విధానాన్ని సూచిస్తోందని అన్నాడు.
కాగా పాక్ తో మ్యాచ్ లో రిషభ్ పంత్‌తో కలిసి భారత్‌కు 151 పరుగుల గౌరవప్రదమైన స్కోరు అందించాడు కోహ్లీ(57). చివరివరకు క్రీజులో ఉన్న అతడు 19వ ఓవర్లో షహీన్ చేతికే చిక్కాడు. అయితే టీమ్ఇండియా విధించిన లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా ఛేదించారు పాక్ ఓపెనర్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్.